కులకచర్ల, మే 19 : అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు కులకచర్ల పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చౌడాపూర్ మండల కేంద్రంలో రైడ్ చేయగా చించెట్టి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైయ్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Spying | పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. నుహ్‌లో మరో వ్యక్తి అరెస్ట్