Farmers Agitation | సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పేదల భూములపై కన్నేస్తుంది. హైదరాబాద్ పరిసరాల్లో ఖరీదైన భూములు ఎక్కడున్నా వాటిని వదిలిపెట్టడంలేదు. ఓ వైపు తమ భూములు ఇచ్చేదిలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నా అవేమి పట్టనట్టుగా ఇండస్ట్రియల్ పార్క్‌ల పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉన్నది. అభ్యంతరాలున్నవారు కలెక్టర్ కార్యాలయంలో చెప్పుకోవాలని హుకుం జారీచేస్తున్నది.
ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ భూములను గుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు 1200 ఎకరాలు భూసేకరణ చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూమలు జోలికి రావొద్దు.. మా భూములు మాకే అంటూ అధికారులను అడ్డుకుని నిరసన తెలుపుతుండగా.. పోలీసులు రైతులపై దౌర్యన్యానికి పాల్పడుతున్నారు.
నిరసనలో పాల్గొన్న మహిళా రైతులని కూడా చూడకుండా విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారు. తాము తాతల కాలం నాటి నుండి ఈ భూముల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, భూసేకరణ ప్రక్రియ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భూములు కోల్పోతున్న రైతులపై పోలీసుల దౌర్జన్యం
మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా తోసేసిన పోలీసులు
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాలు దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో 1200 ఎకరాలు భూసేకరణ చేస్తున్న అధికారులు
మా భూములు మాకే… https://t.co/I4w7NdTvYK pic.twitter.com/zXl7AmzXyJ
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ