Nominations | వికారాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు హంగామా సృష్టించారు. గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ క్లస్టర్లో ఉన్న నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు.
తాము నామినేషన్ వేసిన పత్రాలను మాయం కావడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళన చేయడంతో అధికారులు, పోలీసులు కలగజేసుకుని
నామినేషన్ పత్రాలు, డేటా స్కాన్ చేసి ఉంచామని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారిని సముదాయించారు. మరోవైపు ఒరిజినల్ నామినేషన్ పత్రాలు లేకపోవడంతో పోలీసులు, అధికారులు ఏర్పాటు చేసిన భద్రత చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ
తాండూర్ నియోజకవర్గంలో
పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ క్లస్టర్ లో ఉన్న నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులుఆందోళనలో గొట్లపల్లి,… pic.twitter.com/S7fGOdshiu
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025
Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా