పరిగి, సెప్టెంబర్ 12 : ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పరిగి సబ్ డివిజన్ షీ టీం ఇన్చార్జి నర్సింలు పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఓ కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.
మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు పోలీసు శాఖ చర్యలు చేపడుతుందన్నారు. బాల్య వివాహాల నివారణకు ప్రతిఒక్కరు సహకరించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడంలో తోడ్పడతాయని అన్నారు. నిర్భయ చట్టం, పొక్సో చట్టం, బ్యాంకింగ్ ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీశైలం, షీ టీం సభ్యురాలు సావిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు.