Plastic Mulching Sheet | వికారాబాద్, జూలై 14 : ప్లాస్టిక్ మల్చింగ్ షీట్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే నేల భాగాన్ని కవర్ కప్పి ఉంచడాన్ని మాల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ వేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాటితో రైతులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారులు తెలుపుతున్నారు.
ప్లాస్టిక్ మల్చింగ్ షీట్తో లాభాలు..
•సమగ్ర కలుపు నివారణ: సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడంతో కిరణజన్య సంయోగక్రియ జరిగాక సుమారు 85 శాతం వరకు కలుపు నివారణ అవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది.
•సమర్థవంతమైన నీటి యాజమాన్యం.
•మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడంతో వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40 శాతం వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20 శాతం నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి.
•నీరు పారించడం లేదా వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడంతో నేల కోతను నివారించి పై పారల్లో భూసారాన్ని కాపాడవచ్చు.
•మల్చింగ్ షీటు వేసిన తర్వాత భూమి పైపొరల్లో నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీంతో నీరు, ఎరువులు, భూమి లోపలి పారల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీంతో వంట కాలం తర్వాత నేల తయారీకి అయ్యే ఖర్చ ఆదా అవుతుంది.
•నేల ఉష్ణోగ్రత నియంత్రణ మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వార నేల లో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల స్వభావాన్ని మెరుగు పరుస్తూ పోషక పదార్ధా లు అందేలా చేస్తుంది. దీని ద్వారా భూమిలోని క్రిములు, తెగుళ్లు కలుగ జేయు శిలీంధ్రాలు నివారించబడతాయి.
•మల్చింగ్ షీటుపైన పడిన సూర్యరశ్మి పరావర్తనం చెంది మొక్కల లోపలి అంచు భాగాలకు తగలడంతో ఆకుల అడుగున ఉన్న రసం పీల్చే పురుగులు రాలి కింద పడిపోతాయి. దీని ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తి తగ్గి సస్యరక్షణకు అయ్యే ఖర్చు కొంత మేర ఆదా అవుతుంది.
•ఎరువులు, క్రిమిసంహారక మందులు మల్చింగ్ పద్ధతిలో వేటీ మొత్తం కలుపు కాకుండా పంటకు మాత్రమే చేరుతుంది. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల మోతాదు సమపాళ్లలో డ్రిప్పు ద్వారా పంపి మేలైన దిగుబడులు సాధించవచ్చు. నేలలో వేసిన ఎరువులు భూమి లోపలి పొరల్లోకి వెళ్లకుండా నివారించడంతో కలుపు నివారణ జరిగి అటు ఎరువులు, ఇటు క్రిమిసంహారక మందుల ఖర్చు తగ్గి ఆదా అవుతుంది.
• నాణ్యమైన అధిక దిగుబడులు పంట కాలం అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగడంతో పంట ఏపుగా పెరిగి మంచి నాణ్య తతో కూడిన అధిక దిగుబడులు (20-50 శాతం) పొందవచ్చు.
ఈ సంవత్సరం 1300 ఎకరాల వరకు మల్చింగ్ వేసిన రైతులకు రాయితీ అందించవచ్చను. అర్హులైన రైతులు తమ భూమి పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతాతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సత్తార్ తెలిపారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని