పెద్దేముల్, ఏప్రిల్ 28 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కందనెల్లి గ్రామంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చిప్ విప్ మహేందర్‌రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు కల్పించాలన్నారు.
దేశ సేవలో ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతపై ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.