వికారాబాద్, ఫిబ్రవరి 6 : వికారాబాద్‌ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 9, 19, 28వ వార్డులలో అభ్యర్థులు మమత, జగదీశ్వరి, అరుణలతో కలిసి వేరు వేరుగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంత్సరాలు అవుతుందని, ఇప్పటి వరకు 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.
మహిళలకు రూ.2500లు, చదువుతున్న ఆడ పిల్లలకు స్కూటీలు, కల్యాణలక్ష్మి పథకంలో తులంబంగారం, రైతు బరోసా, గర్భిణిలకు న్యూట్రీషన్ కిట్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్ వంటి తదితర పథకాలను పూర్తిగా మరిచిపోయిందని మండిపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు ఇంటి ముందుకు వస్తే 6 గ్యారంటీలు ఎప్పుడు ఇప్పుడు ఇస్తారని నిలదీయాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన తరువాతనే ఓట్ల కోసం రావాలని గట్టిగా బుద్ది చెప్పాలన్నారు.
కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షులు గోపాల్ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్, అంజి, అనంత్‌రెడ్డి, నర్సింహులు, కార్తీక్, సాయి, ఆర్.మల్లేశం, లింగమయ్య, అనంతయ్య, మల్లయ్య, పర్మయ్య, రాములు, నర్సింహులు, లక్ష్మణ్, హనుమంతు, అనంతయ్య, అశోక్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.