వికారాబాద్, మే 4 : సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్ నివాసంలో బంట్వారం మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టనున్న సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చెయ్యాలని మండల నాయకులను కోరారు.
స్పెషల్ ఇంటెన్సిప్ రివిజన్లో భాగంగా ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సవరించుకోవడానికి తగిన సలహాలు, సహాయం అందించాలన్నారు. ఓటు మిస్సయినైట్లెతే నమోదు చేయించాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.