కులకచర్ల, డిసెంబర్ 7: బైకు అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పోలీస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహమ్మదాబాద్ మండలం మంగంపేట్ గ్రామానికి చెందిన గణేశ్(20) తన బైక్‌పై నుండి కులకచర్ల నుండి ఆయన గ్రామానికి వెళుతున్నాడు.
కాగా, కులకచర్ల మండలం ఘనాపూర్ స్టేజ్ దగ్గర బైక్ అదుపు తప్పి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించచారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు మంగంపేట్ గ్రామానికి చెందిన గణేశ్‌గా గుర్తించారు.