వికారాబాద్, అక్టోబర్ 5 : వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి ప్రారంభమై ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షానికి వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల, ధ్యాచారం, ధన్నారం తదితర వాగులు రోడ్లపై ఉధృతంగా పారాయి.
దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఆయా గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కూరగాయలు, కంది, మొక్కజొన్న తదితర పంట పొలాలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.