తాండూరు రూరల్, జూలై 17 : నాలుగు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే జీతాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ తాండూరు మండల ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ఎంపీఈవో సుశీల్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా జీతాలు లేకపోవడంతో విద్యార్థుల ఫీజలు, ఇంటి కిరాయిలు కట్టేలకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో నరోత్తంరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.