పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి
టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కార్యాలయంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్ అధికారులతో మం గళవారం ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14నుంచి ఏప్రిల్ 16 వరకు 82 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- సిద్దిపేట కలెక్టర్ హైమావతి
సిద్దిపేట, ఫిబ్రవరి 24: టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కార్యాలయంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ గురించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్ అధికారులతో మం గళవారం ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14నుంచి ఏప్రిల్ 16 వరకు 82 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం 15358 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు 82, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 82, కస్టోడియన్ ఆఫీసర్లు తొమ్మిది మందిని నియమించినట్లు తెలిపారు. 82 కేంద్రాల్లో వాష్ రూమ్స్ క్లీనింగ్, వాటర్ సౌకర్యం, సెంటర్లో ఏఎన్ఎం,మెడికల్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సెంటర్‌కు వచ్చేలా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

