బొంరాస్ పేట, జూన్ 6 : మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్ల పనులను, వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుర్రి తాండ నుండి బొంరాస్ పేట వరకు మెట్లకుంట మీదుగా నిర్మించే రోడ్డు, టేకుల గడ్డ తాండ నుండి ధరూరు మండలం గురుదొట్ల గ్రామం రోడ్డు , సలిందాపూర్ నుండి మాలకుంట మీదుగా ముద్దాయి పేట్ నిర్మిస్తున్న రోడ్లను కలెక్టర్ పరిశీలించారు.
జాతీయ రహదారి నుండి చౌదర్ పల్లి రోడ్డు,కొత్తూరు నుండి దేవనూర్ వరకు,బొంరాస్ పేట మండల కేంద్రానికి రోడ్డు మార్గమధ్యలో నిర్మిస్తున్న కల్వర్టు పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. బురాన్ పూర్ లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులను పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. మండలంలో చేపడుతున్న పనులను నాణ్యతతో వేగవంతంగా అభివృద్ధి పనులను చేపట్టే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
బురాన్ పూర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడుతూ… బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలలో చేర్చే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, డీఈ సుదర్శన్, వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.