Kodangal | బొంరాస్ పేట, జూన్ 7: సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గంలో షాక్ తగిలింది. దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. పార్టీని అంటిపెట్టుకుని ఉండి, ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి ప్రతిచోట అవమానం జరిగిందని పేర్కొన్నారు. ఆ అవమానాలు భరించలేకనే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో మనమే గెలవబోతున్నామని తెలిపారు. కాగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిలో నరసింహారెడ్డి, వెంకటప్ప, శివరాజా, వెంకటేశ్, బాబు, పెద్ద లక్ష్మణ్, నరసింహ, రాఘవేంద్ర, గోపాల్, గోవింద్ తదితరులు ఉన్నారు.