కొత్తూరు, మే 30: ఎవరూ లేని ఇంట్లో దొంగలు పడి రూ.15 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్ స్టేసన్ పరిధిలోని తిమ్మాపూర్ రైల్వే కాలనీలో జరిగింది. కొత్తూరు ఎస్ఐ మురళీగౌడ్ వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ రైల్వే కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం యవజన కాంగ్రెస్ నాయకుడు వన్నాడ శివశంకర్గౌడ్ కుటుంబ సభ్యులు ఇల్లుకు తాళం వేసి శుభకార్యానికి వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు బీరువాలో ఉన్న రూ. 15 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్యు చేస్తున్నామని ఎస్ఐ మురళీగౌడ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Supreme court: ఆ వీడియో డిలీట్ చేయండి.. జర్నలిస్టుకు సుప్రీం ఆదేశం
Ram Kadam | ఆ ఇద్దరు శివసేన నేతలను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : బీజేపీ