Murder case | మొయినాబాద్, అక్టోబర్ 16 : ప్లాట్ విషయంలో గొడవ పడగా అన్న కుమారుడు బాబాయిని అతి దారుణంగా హత్యయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన బాబాయి దవాఖానలో మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామ రెవెన్యూలో 250 గజాల స్థలం రామగళ్ల ఎల్లయ్య పేరు మీద ఉంది.
కాగా ఎల్లయ్యకు ముగ్గురు కుమారులు రామగళ్ల నందం, రామగళ్ల శ్యామ్(45), రామగళ్ల శ్రీకాంత్ ఉన్నారు. అట్టి ప్లాట్ ఎల్లయ్య పెద్ద కుమారుడు నందం నాకు మాత్రమే వర్తిస్తుందని అనడంతో మరో ఇద్దరు కుమారులు శ్యామ్, శ్రీకాంత్ ప్లాట్ పంచాయితీని గత నెల క్రితం గ్రామ పెద్దల వద్దకు తీసుకెళ్లారు. మీ తండ్రి ఎల్లయ్య పేరు మీద ఉన్న ప్లాట్ ముగ్గురు కుమారులకు వర్తిస్తుందని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు. 250 గజాలలో ఒక్కొక్కరికి 83 గజాల చొప్పున స్థలం వస్తుందని నిర్దారించారు. గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం ముగ్గురు ఒప్పుకున్నారు. అనంతరం ఎల్లయ్య పెద్ద కుమారుడు రామగళ్ల నందం తన వాటా కింద వచ్చిన 83 గజాల స్థలాన్ని విక్రయించాడు.
కత్తితో దాడి చేసుకునే పరిస్థితికి..
నందంకు వచ్చిన వాటా అమ్ముకున్న తరువాత కూడా నందం కుమారుడు రామగళ్ల ప్రసాద్ అక్రమంగా తన బాబాయిలు అయినా రామగళ్ల శ్యామ్, రామగళ్ల శ్రీకాంత్ కు సంబంధించిన 160 గజాల స్థలం కబ్జా చేసి ఈ నెల 11వ తేదీన ఫ్రీ కాస్ట్ వేయడానికి ప్రయత్నించాడు. మీకు వచ్చిన వాటా అమ్ముకుని మా వాటాకు సంబంధించిన స్థలంలో ఫ్రీ కాస్ట్ ఎందుకు వేస్తున్నావని రెండవ బాబాయ్ రామగళ్ల శ్యామ్, రామగళ్ల ప్రసాద్ ను అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో బాబాయ్ శ్యామ్, అబ్బాయి ప్రసాద్ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ తారస్థాయికి చేరింది. ఇద్దరి మధ్య గొడవ కాస్తా తీవ్రమై కత్తితో దాడి చేసుకునే పరిస్థితికి దారి తీసింది. అప్పటికే కత్తి తో వచ్చిన ప్రసాద్ తన బాబాయ్ తో గొడవ పడుతూ ఒక్క సారిగా కత్తితో తన బాబాయ్‌పై దాడి చేసాడు. ప్రసాద్ చేసే కత్తి దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసాడు. ఎలాగైనా తన బాబాయ్ శ్యామ్ ను చంపాలని అనుకున్న ప్రసాద్ వెంటాడి వేటాడి అతి కిరాతకంగా విచక్షణ రహితంగా కత్తి తో దాడి చేసాడు.
ఊపిరితిత్తుల మీద పొడవడంతో..
తల మీద, మెడ మీద కత్తి పోట్లు వేసాడు. ఎడమ చేతి పూర్తిగా నరకగా.. కుడి చేయి అర చేతిని సగం నరికాడు. అదే విదంగా కత్తి తో ఊపిరితిత్తుల మీద పొడవడం తో రంద్రం పడింది. ఛాతి మీద కత్తి తో పొడిచి గాయపరిచినాడు. కత్తి తో దాడి చేసిన అనంతరం నేరుగా కత్తి తీసుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ప్రసాద్ పోలీస్ లకు లొంగిపోయాడు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్‌లు తీవ్రంగా రక్త గాయాలతో ఉన్న శ్యామ్ ను చికిత్స నిమిత్తము దవాఖానకు తరలించారు.
గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ ఉస్మానియా దవాఖానలో గురువారం ఉదయం కన్నుమూసాడు. పోలీసు లు పంచనామా నిర్వహించి పోస్ట్ మార్థం చేయించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్య చేసిన ప్రసాద్‌తో పాటు హత్యకు సహకరించిన తండ్రి నందం, తల్లి సావిత్రిని గత నాలుగు రోజుల క్రితం రిమాండ్ కు తరలించారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.