Youth | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 1: జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాను.. ప్రేమలో విఫలమయ్యాను.. నా చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ.. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్ఐ రూప తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
అతడు కేపీహెచ్బీ కాలనీ అడ్డగుట్టలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అతను.. పండగకు ఊరెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు. సోమవారం హాస్టల్ గది నుంచి బయటికి రాకుండా తలుపులు వేసుకోవడంతో.. అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకులు పరిశీలించేసరికి మహేందర్ తాడుతో ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడు.
హాస్టల్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా అక్కడ సూసైడ్ నోట్ లభించింది. మహేందర్ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి