మూసాపేట జూన్ 30 : కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి పరిధి వడ్డేపల్లి ఎంక్లేవ్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాల గురించి ఎంక్వయిరీ చేయగా మృతుడు బోరబండకు చెందిన వహీద్ పైల్వాన్ కుమారుడుగా గుర్తించారు.
మృతదేహం సమీపంలో మద్యం బాటిల్ ఉండటంతో మద్యం సేవించిన తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. అనంతరం హత్యకు పాల్పడింది ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.