Illegal Construction | ఉప్పల్, ఏప్రిల్ 26 : భవనం సెట్ బ్యాక్ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు మహిళలు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ నాగోల్ ప్రధాన రహదారి సమీపంలో భవన నిర్మాణం పూర్తి చేసిన తర్వాత.. అందులో సెట్ బ్యాక్ స్థలంలో రేకులతో కమర్షియల్ షెడ్ నిర్మాణం చేపడుతున్నారని మహిళలు అధికారులకు తెలియజేశారు.
ఇలాంటి అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్మాణదారుడు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాము భవన నిర్మాణానికి సంబంధించి డెవలప్మెంట్ ఇచ్చామని, అయితే తమకు సంబంధం లేకుండానే అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మహిళలు కోరుతున్నారు. అక్రమ నిర్మాణం పై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు జాప్యం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా