MLA KP Vivekanand | జీడిమెట్ల, మార్చి 17 : కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ గౌడ్‌తోపాటు కార్యవర్గ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. నూతన సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్, రాజ్ కుమార్, మాజీ అధ్యక్షుడు బైరీష్ గౌడ్, రామ్ రెడ్డి, మైస గౌడ్,కిషోర్ కుమార్, పూర్ణచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు