Cherlapally Division | చర్లపల్లి, జూన్ 7 : చర్లపల్లి డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, వీఎన్‌రెడ్డి నగర్లో ఇంజినీరింగ్ ఏఈ స్వరూప, కాలనీవాసులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని కాలనీల్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు. డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పరిశీలిస్తున్నామన్నారు. కాలనీలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి, వీరయ్య, రామచంద్రం, రాజశేఖర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బాల్‌రాజు, నగేశ్, హనుమంత్‌రెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మాచారి, సాయి, కృష్ణ, కుమారస్వామి, వెంకట్, సాయిలక్ష్మి, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు