Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, మార్చి 25: మల్కాజిగిరి నియోజక వర్గంలోని అన్ని రూట్లలో ఆర్టీస్ బస్‌లను నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడవకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలసి బస్ సౌకర్యంతో పాటు బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు. మంత్రి ఆదేశాలతో ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి అన్ని రూట్లలో బస్సులను నడపాపడంతో పాటు బస్ షెల్టర్లను నిర్మించాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పవిత్ర, కుషాయిగూడ డిపో మేనేజర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.