MLA Marri Rajashekar Reddy | అల్వాల్, జూలై 7: ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం అల్వాల్ డివిజన్ ఆదర్శనగర్లో రూ.80 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు మహా బోధి స్కూల్ సమీపంలోని బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అల్వాల్ ప్రాంతంలో బాక్స్ డ్రైన్ సదుపాయం లేక వర్షంతో మునిగిపోవడం.. మిగతా రోజుల్లో మురుగునీరు పోయే మార్గం లేక పోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తి కావడం.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల నిత్యం ప్రయాణాలకు సులభతరం అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లడ్డు నరేందర్ రెడ్డి, జేఏసీ సురేందర్ రెడ్డి, డోలీ రమేష్ , శరణ గిరి, విజయ్ శేఖర్, అరుణ్ రావు,యాదగిరి గౌడ్, లింగ రెడ్డి, కన్నా గౌడ్, రాజ్, రెహమత్ ఖాన్, సాజీత్ ఖాన్, అరుణ్, ప్రశాంత్, సతీష్, ఉమ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు