Rowdy Sheeters | బాలానగర్, జూలై 8 : రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని బాలానగర్ ఏసీపీ పి నరేష్ రెడ్డి అన్నారు. మంగళవారం బాలానగర్ సీఐ నరసింహారాజు రౌడీ షీటర్లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచినట్లు తెలిపారు.
బోనాల పండుగను పురస్కరించుకొని ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వదిలి సమాజంలో మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని ఆయన సూచించారు. నేరస్తులు తొందరపాటుతనంతో చేసిన నేరాలు వారి కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లో పడేశాయని గుర్తు చేశారు.
సత్ప్రవర్తన కలిగి ఉన్న నేరస్థులపై షీట్ ఎత్తివేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నేరస్తులు సత్ప్రవర్తన దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సరళ, వినోద్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Trade Deal | త్వరలో అమెరికాతో భారత్తో వాణిజ్య ఒప్పందం.. కీలక సూచనలు చేసిన జీటీఆర్ఐ..
Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..!