Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..!
Horror | ఆధునిక సాంకేతికతతో సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.
Horror : ఆధునిక సాంకేతికతతో సమాజం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా బీహార్ (Bihar) లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంలోని ఐదుగురిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. అదేవిధంగా కర్ణాటక (Karnataka) లో దెయ్యం పట్టిందని ఓ మహిళను కొట్టిచంపారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన 55 ఏళ్ల మహిళ గీతమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దాంతో ఆమె కుమారుడు ఆమెను బూత వైద్యం చేసే దంపతుల దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లు దెయ్యాన్ని వదిలించే పేరుతో సోమవారం రాత్రి 9.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నాలుగు గంటలపాటు చిత్రవధ చేశారు. చేతులతో, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాంతో ఆమె దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుమారుడిని, బూత వైద్యం చేసిన దంపతులను అరెస్ట్ చేశారు.
Shocking!
A 45-year-old woman died after an alleged exorcism ritual in Jambaragatte village, Holehonnuru, near #Shivamogga. Police say she was beaten from 9 pm to 1.30 am by woman who claimed to be a healer capable of casting out demons. The police arrested the accused. pic.twitter.com/IAGKRGnQmC
— Marx Tejaswi | ಮಾರ್ಕ್ಸ್ ತೇಜಸ್ವಿ (@_marxtejaswi) July 7, 2025
Read More >>
మైనర్ కుమార్తెపై నెలలుగా తండ్రి అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సిమ్ కార్డు..!
నైట్ క్లబ్లో యువతి సహా ఇద్దరిపై బౌన్సర్ల దాడి
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పితృవియోగం
కుమార్తె ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్.. తండ్రిపై నెటిజన్ల ఫైర్.. Video
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ప్రాథమిక నివేదిక
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

