Amberpet | గోల్నాక, జూలై 8 : అంబర్పేట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం గోల్నాక డివిజన్ అశోక్ నగర్లో రూ. 34 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. నియోజకవర్గం వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నామని ఆయన తెలిపారు. అనంతరం కాలనీల్లో క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేసి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.