Bonthu Sridevi | చర్లపల్లి, జూన్ 3 : చర్లపల్లి డివిజన్ పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటి సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు.
డివిజన్ పరిధిలోని వీఎన్ రెడ్డినగర్‌లో సీసీ రోడ్డు పనులు చేపట్టడంతో కాలనీవాసులు కార్పొరేటర్ బొంతు శ్రీదేవిని కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలలో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, నాగిళ్ల బాల్‌రెడ్డి, వీరన్న, రామచంద్రారెడ్డి, బాల్‌రాజు, శ్రీకాంత్‌యాదవ్, గోపాల్‌యాదవ్, పాండు తదితరులు పాల్గొన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా