Bird Nests | కాప్రా, ఏప్రిల్ 13 : పర్యావరణాన్ని కాపాడటంలో మొక్కలతోపాటు పక్షిజాలం చాలా ముఖ్యపాత్రలు పోషిస్తాయని తెలిసిందే. పర్యావరణంలో భాగమైన వాటిని సంరక్షించేందుకు అందరూ ముందుకు రావాలని అంటున్నారు పర్యావరణవేత్త నంబూరి కృష్ణం రాజు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకంతో పాటు, పక్షి సంపదను పరిరక్షించే కార్యక్రమాలను చేపట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని నంబూరి కృష్ణం రాజు సూచించారు. ఇవాళ ఈశ్వరిపురి కాలనీ హై టెన్షన్ రోడ్లోని ఆయన నివాసం వద్ద పక్షి గూళ్లు, పక్షుల దాన, నీళ్ల తొట్టెలు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ప్రతీ ఆదివారం తన నివాసం వద్ద పక్షి గూళ్లను, నీళ్ల తొట్టెలను, దానాను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
Rollavagu project | రోళ్లవాగు ప్రాజెక్ట్ కు గేట్లు బిగించక వృథాగా పోతున్న నీరు
IPL 2025 | సెంచరీ హీరో అభిషేక్ శర్మకు వెల్లువెత్తిన అభినందనలు.. గురువు యువరాజ్ ఏమన్నాడంటే..?
Pawan Kalyan | హైదరాబాద్కి వచ్చాక తొలిసారి కొడుకు ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్