Minister Konda Surekha | కీసర, మార్చి 30 : ఉగాది పండుగ సందర్భంగా రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు మతైక అర్చక ఉద్యోగుల సంఘం తరపున కీసరగుట్ట దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
ఉగాది పండుగను పురస్కరించుకొని ఇవాళ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా మంత్రి కొండా సురేఖను తెలంగాణ దేవాలయముల మతైక అర్చక ఉద్యోగుల సంఘం రాష్ర్ట సంఘం అధ్యక్షులు, కీసరగుట్ట వేదపండితులు మార్తి సత్యనారాయణశర్మతో పాటు పలువురు వేదపండితులు వెళ్లి ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్