Drugs | దుండిగల్, మే 29: డ్రగ్స్ కంట్రోల్ అడ్మిషన్ (ఔషధ నియంత్రణ మండలి) అధికారులు గురువారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ సమీపంలోని అలీఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సిప్లాన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ పరిశ్రమ, యూనిట్ -1 పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాలలో అనధికారికంగా నిర్వహించిన వెటర్నరీ ఔషధాలను గుర్తించారు.
సుమారు రూ.3 లక్షల విలువచేసే ఆల్బెండజోల్ టాబ్లెట్స్ 250 ఎం.జి (వెటర్నరీ), 986 కేజీల ఆల్బెండజోల్ గ్రాన్యూయేల్స్(వెటర్నరీ) నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి బోలసెస్, గ్రాన్యూయేల్స్ లైసెన్స్ లేకుండానే తయారు చేయడంతోపాటు, మార్కెట్లో విక్రయాలు చేపడుతున్నట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ ఏడీ, కే ప్రభాకర్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, విక్రమ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం