Labour Codes | అల్వాల్ జూలై 6 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు, కర్షకులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేయాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి బ్యాగరి వెంకటేష్ అన్నారు. ఈ నెల 9న అఖిల భారత కార్మిక సంఘాల సమ్మెను జయప్రదం చేయాలని ఆదివారం అల్వాల్ పట్టణ కేంద్రంలోని యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణ కళాశాలలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి అందరిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను కుదించిందన్నారు.
నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు