కీసర, ఏప్రిల్ 5 : ఔటర్ రింగ్ రోడ్డు మీద మినీ వ్యాన్ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం పాల ప్యాకెట్ల లోడ్‌తో వెళ్తున్న మినీ వ్యాన్ యాద్గార్పల్లి ఔటర్‌రింగ్ వద్దకు రాగానే వ్యాన్ టైర్ పేలి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మహేశ్, వాహనంలో ఉన్న నూర్ ఆలంకు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నగరంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sandalwood | చందనంతో అందం, ఆరోగ్యం రెండింటినీ ఇలా పొందవచ్చు.. ఎలా ఉపయోగించాలంటే..?
Russian Attack: జెలెన్స్కీ స్వంత సిటీపై రష్యా దాడి.. 9 మంది పిల్లలు సహా 18 మంది మృతి
IPL 2025 | రాహుల్ హాఫ్ సెంచరీ.. 13 ఓవర్లకు స్కోర్..!