కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చెందిన స్వంత నగరం క్రివియి రిహ్ సిటీపై రష్యా వైమానిక దాడి(Russian attack) చేసింది. మిస్సైల్ అటాక్‌లో 18 మంది మరణించారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. మరణించినవారిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. క్రివియి రిహ్ సిటీలోనే జెలెన్స్కీ తన బాల్యాన్ని గడిపాడు. ఓ రెసిడెన్షియల్ ప్రాంతంపై బాలిస్టిక్ మిస్సైల్ పడినట్లు స్థానికులు తెలిపారు.ఆ సిటీలో ఉన్న 10 అంతస్తుల బిల్డింగ్ ధ్వంసమైంది. కొందరు ఆ శిథిలాల వద్ద శవమై తేలారు.
ఆ అటాక్‌పై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. హై ప్రిసిషన్ మిస్సైల్ స్ట్రయిక్ చేపట్టినట్లు తెలిపారు. యూనిట్ కమాండర్లు, వెస్ట్రన్ ఇన్స్ట్రక్టర్లు మీటింగ్ నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ను టార్గెట్ చేశారు. ఆ అటాక్‌లో 85 మంది మృతిచెందినట్లు పేర్కొంటున్నా, దానికి సంబంధించిన ఆధారలు మాత్రం వెల్లడికాలేదు. తమ నేరాల పట్ల రష్యా తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఉక్రెయిన్ మిలిటరీ ఆరోపించింది.
ఇస్కాండర్-ఎం బాలిస్టిక్ మిస్సైల్‌ను క్లస్టర్ వార్‌హెడ్‌తో దాడి చేసినట్లు రష్యా చెప్పింది. ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించాలన్న ఉద్దేశంతో ఆ దాడి చేసినట్లు రష్యా వెల్లడించింది. శుక్రవారం జరిపిన దాడిలో కనీసం అయిదు బిల్డింగ్లు ధ్వంసమైనట్లు జెలెన్స్కీ తెలిపారు.