IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(51) దంచి కొడుతున్నాడు. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) స్పిన్నర్లను ఉతికారేస్తున్న రాహుల్ అర్ధ శతకం సాధించాడు. పథిరన సింగిల్ తీసి అతడు 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌కు ఐపీఎల్లో ఇది 38వ హాఫ్ సెంచరీ. సమీర్ రిజ్వీ 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..
టాస్ గెలిచిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(o)ను ఖలీల్ అహ్మద్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(51), అభిషేక్ పొరెల్(33)లు దూకుడుగా ఆడారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్న పొరెల్‌ను జడేజా బోల్తా కొట్టించాడు. అక్కడితో 54 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్(21) ఔటయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన అక్షర్.. క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో, 90 వద్ద ఢిల్లీ మూడో వికెట్ పడింది. కెప్టెన్ వెనుదిరగడంతో మూడో వికెట్‌కు 36పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.