హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి చెంగిచెర్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. రెండు ఇండ్లలో చొరబడి 20 తులాల వెండి, బంగారు ఉంగరం, టీవీ, 18 వేల నగదు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో 30 తులాల వెండి ఆభరాణాలు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వరుస దొంగతనాలతో భయపడిపోతున్న స్థానిక ప్రజలు అధికారులు నిఘా పెంచి దొంగల బారినుంచి కాపాడలని వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు
Gaza Conflict | మూగబోతున్న గాజా బాల్యం.. యుద్ధ విధ్వంసంతో మాట కోల్పోతున్న పిల్లలు