Gaza Conflict | మూగబోతున్న గాజా బాల్యం.. యుద్ధ విధ్వంసంతో మాట కోల్పోతున్న పిల్లలు
యుద్ధం అంటేనే విధ్వంసం, వినాశనం. గత కొన్ని ఏండ్లుగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో ఇప్పటికే వేలాది మంది మరణించగా, పలువురు నిరాశ్రయులయ్యారు. మృతులలో పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక గాయపడిన పిల్లలు అయితే చాలామంది ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు.
- కొరవడిన వైద్య సౌకర్యాలు
- చికిత్స అందకపోతే తరం మొత్తం మూగవారవుతారు
- హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
గాజా, ఏప్రిల్ 26 : యుద్ధం అంటేనే విధ్వంసం, వినాశనం. గత కొన్ని ఏండ్లుగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో ఇప్పటికే వేలాది మంది మరణించగా, పలువురు నిరాశ్రయులయ్యారు. మృతులలో పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక గాయపడిన పిల్లలు అయితే చాలామంది ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ‘యుద్ధంలో తమ పిల్లలు మరణించి ఉన్నా బాగుండు’ అని కొందరు తల్లులు ఆవేదనతో అంటున్న మాటలు ప్రస్తుత దయనీయ పరిస్థితిని వెల్లడిస్తున్నది. చాలామంది పిల్లలు తీవ్ర శారీరక, మానసిక గాయాలతో బాధపడుతున్నారు. శారీరక గాయాలకు చికిత్స జరుగుతున్నా.. మానసిక గాయాలకు మందు వేసే వారే కరువయ్యారు. ప్రస్తుతం గాజాలోని పిల్లల్లో చాలామంది సరిగ్గా మాట్లాడలేక పోతున్నారు. అల్జజీరా కథనం ప్రకారం.. గాజాలో పెద్దయెత్తున జరిగిన బాంబు దాడులతో పలువురు పిల్లలు దివ్యాంగులుగా మారి శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
మాటను కోల్పోతున్న పిల్లలు
తలపై గాయాలు, నాడీ సంబంధిత నష్టాలు, పేలుడు గాయాల ప్రభావం పిల్లల్లో బయటపడుతున్నాయి. పిల్లల మానసిక చికిత్సా నిపుణుడు కాట్రిన్ గ్లాట్జ్ బ్రుబాక్ దీనిని విధ్వంసం తీవ్రత కింద దాగి ఉండే నిశ్శబ్ద వేదనగా పేర్కొన్నారు. పిల్లలు పడుతున్న ఈ బాధలన్నీ కేవలం శారీరక గాయాల వల్ల ఏర్పడినవి కావని, యుద్ధ విధ్వంసం, తీవ్రత, బాంబు భయాలు, పేలుళ్ల కారణంగా ఏర్పడే షాక్, భయం నుంచి వచ్చినవని తెలిపారు. అప్పటివరకు మామూలుగానే మాట్లాడే పిల్లలు బాంబు దాడులు లాంటి ఘటనలు చూసిన తర్వాత, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత మాట్లాడే శక్తిని కోల్పోతున్నారు. అలాంటి సమస్యలకు త్వరగా చికిత్స అందించకపోతే దాని ప్రభావం వారి జీవితమంతా చూపించి బాధపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం గాజాలోని దవాఖానల్లో మానసిక ఆరోగ్యం, స్పీచ్ థెరపీ లాంటి ప్రత్యేక సేవలు లభ్యం కాకపోవడంతో పిల్లలను చూసి తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతంగా ఉంది. గాజాలోని పిల్లలందరికీ మానసిక చికిత్స, సహకారం అందించకపోతే ఒక తరం అంతా మానసిక గాయాలతో పెరుగుతారని, కనీసం మాట్లాడేందుకు వారికి గొంతుక కూడా ఉండకపోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

