Medchal | మేడ్చల్, మార్చి 1 : మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుడి తలుపులు పగులగొట్టి కొందరు దుండగులు గర్భగుడిలోకి చొరబడ్డారు.
అమ్మవారి బంగారు పుస్తెల తాడు, ముక్కు పుడక, వెండి మట్టెలు, ఆలయ వార్షికోత్సవానికి విరాళంగా వచ్చిన రూ.10వేల నగదు, ఆహుజా ఆంప్లిఫయర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా, ఈ ఆలయంలో ఇప్పటికి మూడుసార్లు చోరీ జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.