MLA Mallareddy | పోచారం, మే 31 : పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మూడవ వార్షికోత్సవం ప్రత్యేక ఉత్సవాలలో మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని బీఆర్ఎస్ నాయకులు, గౌడ కులస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజల అభీష్టం మేరకు అన్ని ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షుడు ఎంజాల శంకర్ గౌడ్, మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్లు వెంకటేశ్ గౌడ్, సాయిరెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కొర్రెముల గ్రామ మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, నాయకులు బి సత్తిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, గౌడ సంఘం ప్రతినిధులు వెంకటస్వామి గౌడ్, దర్శన్ గౌడ్, శంకర్ గౌడ్, భాస్కర్ గౌడ్, విజయ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే మల్లారెడ్డి చౌదరిగూడలో చిన్న పిల్లల ప్రయివేటు పాఠశాలను ప్రారంభించారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత