SYNERGY 2025 | దుండిగల్, ఏప్రిల్ 2 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లి, రాజీవ్ గాంధీ నగర్ సమీపంలోని బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం సినర్జీ-2025 (SYNERGY 2025) పేరిట సాంకేతిక, సాంస్కృతిక ఉత్సవం ఘనంగా జరిగింది. వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలు మహిళ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వేడుకకు వి ఎనేబుల్, వీ హబ్ డైరెక్టర్ అన్ని విజయ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మహిళా విద్యార్థులు ప్రతి సమస్యను ఒక అవకాశంగా తీసుకుని దానికి పరిష్కారాలు కనుగొనేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు సాంకేతికతను నేర్చుకుని తమను తాము అభివృద్ధి చేసుకోవాలన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ డా.కెవీఎన్ సునీత, సినర్జీ-2025 కన్వీనర్ డా మాలతి మాట్లాడుతూ.. ఇటువంటి సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణతో విద్యార్థుల్లో పోటీ భావాన్ని పెంపొందించేందుకు తోడ్పాటును అందిస్తుందన్నారు. మొత్తం మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకల్లో సుమారు 35 ఈవెంట్లు జరుగుతాయని తెలిపారు. ఇందులో రోబోటిక్స్, ఏఆర్అండ్ఈఆర్, త్రీడీ ప్రింటింగ్, లాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.