Govt School | జవహర్నగర్, జులై 3 : పేద పిల్లలకు సేవ చేయడంలోనే ఆనందం దాగి ఉందని, చదువుతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారని మెర్సీ హ్యాండ్స్ పౌండేషన్ అధ్యక్షురాలు కెరోలిన్ అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని చెన్నాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెర్సీ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం బ్యాగులు, స్టేషనరి వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా కెరోలిన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు. మెర్సీ హ్యాండ్స్ పౌండేషన్తో పేద పిల్లలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెర్సీ హ్యాండ్స్ పౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్