Tejas Jets: 35 తేజస్ యుద్ధ విమానాలను గ్రౌండ్ చేసిన ఐఏఎఫ్ !
Tejas Fighter Jets: తేజస్ యుద్ధ విమానాలను గ్రౌండ్ చేశారు. ప్రస్తుతం భారతీయ వైమానిక దళంలో సుమారు 35 తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మెయింటేనెన్స్ చెకింగ్ నేపథ్యంలో ఆ యుద్ధ విమానాలను గ్రౌండ్ చేసినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: తేజస్ యుద్ధ విమానాల(Tejas Jets)ను గ్రౌండ్ చేశారు. ప్రస్తుతం భారతీయ వైమానిక దళంలో సుమారు 35 తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మెయింటేనెన్స్ చెకింగ్ నేపథ్యంలో ఆ యుద్ధ విమానాలను గ్రౌండ్ చేసినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 7వ తేదీన ఓ తేజస్ విమానం కూలిన ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో రన్‌వే మీద నుంచి పక్కకు వెళ్లి ఆ విమానం కూలింది. వెస్ట్రన్ ఫ్రంట్‌లో ఈ ఘటన జరిగింది. రన్‌వే సమీపంలో ఉన్న బురద గుంటలో ఆ విమానం పడింది. వాస్తవానికి ఆ ప్రమాదానికి చెందిన పూర్తి నివేదిక లేదు. కానీ తమ దళంలో ఉన్న అన్ని తేజస్ విమాలను చెక్ చేయాలని ఐఏఎఫ్ ఆదేశించింది.
విమానాలను గ్రౌండ్ చేసిన తర్వాత వాటిని పూర్తిగా, క్షుణ్ణంగా పరీక్షిస్తారు. వీల్స్‌కు చెందిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ సాఫ్ట్వేర్ ను తనిఖీ చేస్తారు. ఆ రోజు సింగిల్ సీటు విమానం ప్రమాదానికి గురైంది. దాంట్లో ఉన్న పైలెట్ సురక్షితంగా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో.. కేవలం టేకాఫ్ స్పీడ్‌తో జెట్ ఉన్నట్లు గుర్తించారు. ఆ స్పీడ్ కేవలం 170 కిలోమీటర్ల మాత్రమే ఉన్నది. ఫిబ్రవరి ఏడో తేదీ ఘటన గురించి కానీ, ఫ్లీట్‌లో ఉన్న విమానాల గ్రౌండింగ్ గురించి కానీ ఐఏఎఫ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆ ప్రమాదం పట్ల కోర్టు విచారణకు ఆదేశించారు.
ఇప్పటి వరకు మూడు తేజస్ విమానాలు కూలాయి. 2016లో తొలి తేజస్ కూలింది. 2024 జైసల్మేర్‌లో ఆ ఘటన జరిగింది. 2025 నవంబర్‌లో రెండో ఘటన జరిగింది. దుబాయ్ ఎయిర్‌షోలో విన్యాసం చేస్తూ ఓ విమానం పేలింది. ఆ ప్రమాదంలో వింగ్ కమాండర్ నమాన్ష్ సయల్ ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఘటన క్రాష్ కాదు అని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. 40 తేజస్ విమానాలకు ఆర్డర్ చేయగా, ప్రస్తుతం 35 సర్వీసులో ఉన్నాయి. మరో రెండు డెలివరీ చేయాల్సి ఉన్నది. మరో 180 తేజస్ మార్క్ 1ఏ విమానాల డెలివరీ ఇప్పటికే రెండేళ్ల ఆలస్యమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

