పెరిగిన పంటల విస్తీర్ణం.. నిరుటితో పోలిస్తే 10% అధికం
రాష్ట్రంలో గత వానకాలం సీజన్‌తో పోలిస్తే ఈ సారి 10 శాతం మేర అధిక విస్తీర్ణంలో పంటలు సాగైనట్టు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
- వానకాలం పంటల విస్తీర్ణంపై వివరాలు వెల్లడించిన అగ్రి వర్సిటీ
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గత వానకాలం సీజన్‌తో పోలిస్తే ఈ సారి 10 శాతం మేర అధిక విస్తీర్ణంలో పంటలు సాగైనట్టు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. యూనివర్సిటీలో నిరుడు ఏర్పాటుచేసిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలోని రిమోట్‌సెన్సింగ్ అండ్ జీఐఎస్ వ్యవస్థ సేకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణ ద్వారా తాజా పంటల విస్తీర్ణం వివరాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య బుధవారం విడుదల చేశారు.
2026 జూలై 29 వరకు రాష్ట్రంలో సాధారణ పంటల విస్తీర్ణం సుమారు 98.13 లక్షల ఎకరాలు కాగా, అందులో సుమారు 33 లక్షల ఎకరాల విస్తీర్ణంలో(34శాతం)ఇప్పటికే వివిధ పంటలు వేసినట్టు తెలిపారు. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే 24.65 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఈసారి దానికి మించి 10 శాతం అధికంగా సాగైనట్టు చెప్పారు. అత్యధిక విస్తీర్ణంలో పంటలు వేసిన జిల్లాల్లో యాదాద్రిభువనగిరి(57శాతం), మేడ్చ ల్ మలాజిగిరి(54శాతం), జనగామ(51శాతం) ఉన్నాయి. తకువ విస్తీర్ణంలో విత్తనాలు నాటిన జిల్లాల్లో ఖమ్మం(16.5 శాతం), వనపర్తి(17.3 శాతం), వరంగల్ (20.1శాతం) చివరి మూడు స్థానాల్లో ఉన్నట్టు వివరించారు. వరి, పత్తి, మొకజొన్న పంటలు సాగు విస్తీర్ణంలో సింహభాగం ఆక్రమించాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

