International Yoga day | ఉప్పల్, జూన్ 21 : చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటూ యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఉప్పల్ పరిధిలో యోగా డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నాచారంలోని అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం నిర్వహించారు. ప్రముఖ యోగా మాస్టర్స్ శ్రీపూజిత, సాయికుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల గౌరవ డైరెక్టర్ శివ్ కుమార్, కరస్పాండెంట్ కల్పన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
యోగా, వ్యాయామం శారీరక, మానసిక శ్రేయస్సుకు గణనీయమైన ప్రయోజనాలను చూపుతుందని తెలిపారు. విద్యార్థులు తమ చిన్నతనం నుంచే యోగాను నేర్చుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిశాత్ అంజూమ్ మాట్లాడుతూ.. యోగా ఒత్తిడిని తగ్గించటంలో, ఏకాగ్రతను పెంచడంలో సహాయ పడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
యోగ సాధన ఒక్కటే సులువైన మార్గం..
రామంతాపూర్, జూన్ 21 : 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రామంతాపూర్ లోని శ్రీ చైతన్య యోగ సెంటర్ ఆధ్వర్యంలో యోగాసనాచార్య బొడ్డు రవీందర్ నిర్వహించిన యోగాసనాలు ప్రాణాయామం శుద్ధి క్రియలను యోగ సాధకుల ద్వారా ఘనంగా నిర్వహించారు. జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ , స్థానిక కార్పోరేటర్ బండారి శ్రీవాణి , ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత కాదంబరి కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా యోగాసనాలు ప్రాణాయామ సాధన చేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఆధునిక జీవనశైలి.. వేగవంతమైన జీవితం, ఒత్తిడితో కూడిన జీవన విధానం, కలుషితమైన నీరు గాలి, ఆహారం వలన ఎన్నో విషపదార్థాలు ప్రమాదకరవుతున్నాయని.. వాటి వల్ల వివిధ రకాలైన యాసిడ్స్ మన శరీరంలో కూరుకుపోయి అవి మన జీర్ణవ్యవస్థ మూత్రపిండాలు, ఊపిరితిత్తులు గుండె తదితర భాగాల మీద దుష్ప్రభావాన్ని చూపుతూ అనారోగ్యాలకి సమస్యలను తెచ్చిపెడుతుందన్నారు. ఈ సమస్యలను పూర్తిగా తగ్గించుకోవాలంటే యోగ సాధన ఒక్కటే సులువైన మార్గమని.. ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలన్నారు. ఆరోగ్య మైనటువంటి శరీరము మానసిక స్థితులను మన ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రతిరోజు యోగాను అభ్యసించాలన్నారు. తద్వారా అందరూ ఆనందం, ఆరోగ్యం పొందాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యోగ సాధకులు ముత్తినేని జగదీష్ తోడి నరసింహ ఇటికల వెంకటేశు మరియు రాధిక సుష్మిత ఝాన్సీ సరిత ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యానవనంలో యోగా..
రామంతాపూర్, జూన్ 21 : హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా డివిజన్లోని గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రవీంద్ర నగర్లోని కెప్టెన్ వీరా రాజారెడ్డి ఉద్యానవనంలో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. అందరూ ప్రతి రోజు యోగా చేయాలని తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు .
ఈ కార్యక్రమంలో యోగా కార్యక్రమ నిర్వాహకులు, బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, కొండెరు స్రవంతి ,తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ మైదానంలో యోగాసనాలు..
రామంతాపూర్, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫెవికాల్ చాంపియన్ క్లబ్ అధ్యక్షుడు చెల్లోజు ఎలాచారి ఆధ్వర్యంలో రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ సభ్యులందరూ యోగాసనాలు వేసి యోగా వలన కలిగే ప్రయోజనాలను సభ్యులకు వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి రోజు దినచర్యలో యోగా అలవాటు చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫెవికాల్ ఇంచార్జ్ అజయ్ ఠాకూర్, క్లబ్ సభ్యులు పూసల కనకాచారి, విశ్వనాధుల రామకృష్ణ, మాతంగి ధనంజయ, వడ్ల బ్రహ్మచారి,పగిడోజు నర్సింహ్మ చారి, కేతోజు రాఘవాచారి, కేతోజు కృష్ణచారి, మట్ట అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్