Shambipur Krishna | దుండిగల్, జూన్ 4: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూపూర్ లోని కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
వారంతా ఈ సందర్భంగా ఆయనకు పలు ఆహ్వానాలు, వినతులు అందజేయగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా శంబిపూర్ కృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కెపి వివేకానంద దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, అర్కల ఆనంద స్వామి ముదిరాజ్, మహేందర్ యాదవ్, నరసింగం భరత్, వార్డు ప్రెసిడెంట్లు రమేష్ ముదిరాజ్, లక్ష్మణ్, మాజీ గ్రామ ఉపసర్పంచ్ కుంట్ల అమర్నాథ్, మాజీ వార్డు సభ్యులు నరసింహ, బాలకృష్ణ, సీనియర్ నాయకులు రంజిత్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు