Bhu Bharathi Act | ఘట్ కేసర్, జూన్ 11 : భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొని వెంటనే పరిష్కరించుకోవాలని ఘట్ కేసర్ తహసీల్దార్ డీఎస్ రజినీ తెలిపారు. ఘట్కేసర్ మండల పరిధి మర్రిపల్లిగూడలో బుధవారం జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆమె పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి భూభారతి చట్టం పరిధిలో వెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తహసీల్దార్ డీఎస్ రజనీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేష్ నాయకులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు