SBI | నిజాంపేట్ ,జూన్ 24 : ఎస్బీఐ బ్రాంచ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కార్పోరేట్ సామాజిక బాధ్యతగా బాలికల ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన నిజాంపేట్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాలలో ఎస్బీఐ హైదరాబాద్ వారు కార్పోరేట్ సామాజిక బాధ్యతగా నూతనంగా మౌలిక వసతుల కోరకు సౌచాలయాలు నిర్మింపజేశారు.
మంగళవారం నిజాంపేట్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఎం సురేష్ నిర్మించిన సౌచాలయలను ప్రారంబించారు. అనంతరం రెండు అంగాన్వడి కేంద్రాలకు ఆట విడుపు వస్తువులను అందజేశారు. ఈసందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది ఎస్బీఐ బ్రాంచ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి కార్యదర్శి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ జగదీశ్వర చారి, పాఠశాల సిబ్బంది, ఎస్బీఐ బ్రాంచ్ సిబ్బంది, స్థానిక నాయకులు రాధకిషన్, జాల శేంకర్, రాంచెందర్ పాటీల్, జింకల వేంకటేశం, మిస్కిన్, సంగమేశ్వర్, పోచయ్య, కిట్టు, శ్రీకాంత్, పలువురు పాల్గొన్నారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు