Sanitation Workers | కాప్రా, జూలై 5 : ప్రతినిత్యం అపరిశుభ్ర వాతావరణంలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది తమ ఆరోగ్యం విషయమై జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి జగన్ అన్నారు. శనివారం కాప్రా డివిజన్ సైనిక్‌పురిలోని వార్డు కార్యాలయంలో జీహెచ్ఎంసీ పారిశుద్యవిభాగం అందజేసిన వ్యక్తిగత కిట్లను పారిశుద్య సిబ్బందికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ.. అన్నికాలాల్లో విధులను నిర్వహించే సందర్భంగా పారిశుధ్య సిబ్బంది పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి అన్నివిధాలుగా ఉపయోగపడే విధంగా సబ్బులు, నూనె, శానిటైజర్, మాస్కులు, టోపీలు, గ్లౌజులు మొదలైన వస్తువులతో కూడిన వ్యక్తిగత రక్షణ పరికరాలతో కూడిన కిట్లను జీహెచ్ఎంసీ పారిశుద్యసిబ్బందికి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వాటిని పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
సమయానుకూలంగా కిట్‌లోని రక్షణ వస్తువులను వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విధులను చిత్తశుద్దితో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు, శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్లు, ఎస్ఎఫ్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు