Transfer | దుండిగల్, ఏప్రిల్ 30 : గండి మైసమ్మ-దుండిగల్ మండలం గిర్దావర్ (ఆర్ఐ) అన్వేష్‌పై బదిలీ వేటు పడింది. గత కొన్ని నెలలుగా ఇక్కడ గిర్దావర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అన్వేష్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా మండల పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడటంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు మిన్నంటాయి. భూకబ్జాదారులతో మిలాకత్ అయ్యారనే తీవ్రమైన ఆరోపణలు లేకపోలేదు. ఫలితంగా మండల పరిధిలోని కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 22వ తేదీన మండల పరిధిలోని డి.పోచంపల్లి, సర్వేనెంబర్ 120లో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై పేట్రేగుతున్న భూ కబ్జాదారులు పేరిట శీర్షిక ప్రచురితమైన విషయం విదితమే. అదేరోజు ప్రభుత్వ స్థలంలో వెలసిన ఓ నిర్మాణానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన గిర్దావర్ తిరిగి తన ఫిర్యాదును వాపస్ తీసుకోవడం పట్ల ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.
ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గిర్దావర్లతోపాటు పలువురు సీనియర్ అసిస్టెంట్లను కలెక్టర్ గౌతమ్ బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా గండి మైసమ్మ – దుండిగల్ మండలం గిర్దావర్ అన్వేష్‌ను మూడు చింతలపల్లి మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ గిర్దావర్‌గా పనిచేస్తున్న రజనీకాంత్‌ను గండి మైసమ్మ- దుండిగల్ మండలానికి బదిలీ చేశారు. కాగా కేవలం కొద్ది కాలంపాటు మాత్రమే ఇక్కడ పనిచేసిన అన్వేష్ పలు ఆరోపణలతో బదిలీ కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం