Caste Census | జవహర్‌నగర్, ఫిబ్రవరి 16 : కుల గణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకుని మీ కుటుంబ వివరాలు తెలుపగలరని కమిషనర్ వసంత ఒక ప్రకటనలో తెలియజేశారు.
కుటుంబాలు స్వచ్ఛందంగా సామాజిక, ఆర్ధిక, విద్యా, రాజకీయ కుల సర్వేలో పేర్లు నమోదు చేసుకొనేలా ప్రజా పాలన సేవా కేంద్రం కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 16 నుంచి 28 వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అధికారులు అందుబాలులో ఉంటారని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్ 8978995862కు కాల్ చేయగలరని సూచనలు చేశారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్