Real State | బోడుప్పల్, జూన్ 25 : తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ రంగం కుదేలవుతుందని తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారు, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్ధకాలంగా పరుగులు పెట్టిన రియల్ ఎస్టేట్ రంగం సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు.
టీఎస్ బీపాస్ విధానంతో గృహ, వాణిజ్య సముదాయాల అనుమతులను సరళీకృతం చేస్తూ నిర్మాణ రంగానికి గత ప్రభుత్వం అండగా నిలిస్తే.. నేటి కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో రియల్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. బెంగళూరు, అమరావతి లాంటి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుంటే హైదరాబాద్లో మాత్రం హైడ్రా దెబ్బకు తిరోగమన దిశలో ఉందన్నారు. దిగువ పేద,మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నిజం చేసుకోవాలంటే హైడ్రా దెబ్బకు హడలిపోతున్నారని అన్నారు.
చెరువు, కుంటల పరిరక్షణ ఏది..?
నిజం కాలం నుండి చెరువుకుంటలలో పట్టాదారులుగా కొనసాగుతున్న రైతుల నుండి ల్యాండ్ ఆక్విజేషన్ చేసి వారికి పునరావాసం కల్పించి చెరువుకుంటల బౌండరీలను నిర్ధారించి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలన్నారు.
రియల్ రంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి…
రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలిచే రియల్ రంగానికి ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. హైరైజ్ బిల్డింగ్స్, విల్లాల నిర్మాణానికి అనుమతులను సరళీకృతం చేయాలన్నారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు 11.6 కి.మీ ఎక్స్ ప్రెస్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల సత్యనారాయణ, ప్రతినిధులు మురళి, రమేష్, హరి శంకర్ రెడ్డి, సతీష్, రమేష్ బాబు, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ